Tadbund Hanuman imageభాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి), వైశాఖ బహుళదశమినాడు (పెద్ద హను మాన్) జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హన్ మాన్‌ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం యాగాదులు నిర్వహిస్తారు. నేడు పెద్ద హనూమాన్ జయంతి ఈ సందర్బంగా సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లో ఉండే ప్రముఖ హనూమాన్ టెంపుల్ తాడ్ బండ్ వీరాంజనేయస్వామి దేవాలయం పై ప్ర్యతేక కథనం.

– తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.
– ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే… హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకం పై ఉంటుంది. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. ఇక్కడ వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి.
– గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది.
– 40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. మండల ప్రదక్షిణాలు మరియు పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు.
– భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు.
– ఈ ఆలయం రజత, బంగారు జూబ్లీ ఉత్సవాలను కూడా జరుపుకుంది
– ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ కోలాహలం మాములుగా ఉండదు. వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను విస్తృతంగా ఏర్పాటు చేస్తారు.
– వాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్.
– తక్కువ సొమ్ముతో పెళ్ళి వేడుకలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు.
(కళ్యాణ మండపం బుకింగ్ కోసం : శ్రీ క్యాస లక్ష్మీ నారాయణ, ట్రస్టీ ఫోన్ నెం: 040 – 656 41 658. గదుల కేటాయింపుల కోసం ఫోన్ నెం. 040 – 664 99 966, 98490 18297)

దర్శన వేళలు :

– ప్రతిరోజూ (మంగళ, శనివారాలలో తప్ప) ఉదయం 5. 00 గంటల నుండి 11.30 వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి 8.30 వరకు.

– మంగళవారం ఉదయం 4.00 గంటల నుండి 12.00 వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి 9.00 వరకు

– శనివారం ఉదయం 4.00 నుండి 12.30 వరకు

మంగళ, శనివార అభిషేకాల సమయం :

– అభిషేకం ఉదయం 4.00గంటలకు

– మిగతా రోజులలో అభిషేకం ఉదయం 5.00 గంటలకు. (అభిషేకం తరువాత సింధూర అలకారం మరియు విశ్వరూప అలంకారం ఉంటాయి)

వాహన పూజ మరియు అర్చన సమయ వేళలు :

– ప్రతిరోజూ (మంగళ, శనివారాలు తప్ప) ఉదయం 8.30 గంటలనుండి 11.00 వరకు తిరిగి సాయంత్రం 4.30 గంటలనుండి 8.00 వరకు

– మంగళవారం ఉదయం 8.30 గంటలనుండి 11.30 వరకు, సాయంత్రం 4.30 గంటలనుండి 8.30 వరకు.

– శనివారం ఉదయం 8.30 గంటలనుండి 11.30 వరకు, సాయంత్రం 4.30 గంటలనుండి 10.00 వరకు.

హనూమాన్ జయంతి సందర్భంగా భక్తులు కోలాహలంగా నిర్వహించే శోభాయాత్ర ఈ తాడ్ బండ్ ఆలయం వద్దే ముగుస్తుంది. దీంతో ఇక్కడ పోలీసులు ప్రత్యేకమైన నిఘాతోపాటు గట్టి భద్రత చర్యలు తీసుకుంటారు.